పై చిత్రంలో ఇలా ఉంది;
ఒక సర్వే ప్రకారం 62 శాతం దంపతులు కొంత డబ్బునైనా ఒకరికొకరు సంబంధం లేకుండా వేరుగా ఉంచుకుంటున్నారని తేలింది.”
ఇది నిజమో కాదో కపుల్స్ మీరే చెప్పాలి?
పై చిత్రంలో ఇలా ఉంది;
ఒక సర్వే ప్రకారం 62 శాతం దంపతులు కొంత డబ్బునైనా ఒకరికొకరు సంబంధం లేకుండా వేరుగా ఉంచుకుంటున్నారని తేలింది.”
ఇది నిజమో కాదో కపుల్స్ మీరే చెప్పాలి?
24 అవర్స్ ఇంటెన్సివ్ కేర్ లో ఉంచిన తర్వాత..
” డాక్టర్! మా స్టూడెంట్ కి ఎట్లా ఉంది? ” శ్రవణ్ కుమార్ సార్ డాక్టర్ని అడిగాడు.
” ఇప్పుడు స్టేబుల్‌గా ఉన్నాడు. కానీ కొంతకాలం పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. “
” ఏమైంది డాక్టర్? “
” మీ వాడికి ఒక హార్ట్ కండిషన్ ఉంది. hypertrophic cardiomyopathy. “” అంటే డాక్టర్?”
” అంటే… మీ వాడికి Hypertrophic Cardiomyopathy ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే, మీ వాడి గుండె కండరం సాధారణం కంటే మందంగా పెరిగింది. దాని వల్ల గుండె పనితీరులో సమస్య ఏర్పడి, హార్ట్‌బీట్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దాంతోనే మీ వాడికి స్పృహ తప్పింది.”
“ఓహ్, డాక్టర్ ఇది పూర్తిగా తగ్గిపోతుందా? “
” పూర్తిగా క్యూర్ చేయడం సాధ్యం కాదు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్, రెగ్యులర్ చెకప్స్‌తో దీన్ని కంట్రోల్‌లో ఉంచొచ్చు. ప్రస్తుతం మీ వాడి కండిషన్ స్టేబుల్‌గా ఉంది. ఇక నుంచి మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కానీ… మీ వాడికి ఇలా స్పృహ తప్పడం ఇదే మొదటిసారి కాబట్టి, దీన్ని మాత్రం సీరియస్‌గా తీసుకోవాలి.”
” అట్లాగే డాక్టర్. థ్యాంక్ యూ “
డాక్టర్ వెళ్ళిపోయారు. నా కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి.
“ఇప్పుడేట్లా ఉంది?” అంటూ శ్రవణ్ సార్.
“బానే ఉంది సార్.”
“అసలు ఏమైంది?”
“ఏమో సార్… ఒక్కసారిగా ఊపిరి అందనట్టుగా అనిపించింది. కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అంతే… తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు.”
“నీకు ఇంకా విషయం తెలియదు అనుకుంటా! నీకొచ్చింది మామూలు కళ్ళు తిరగడం గాదు… Hypertrophic Cardiomyopathy! ఫస్ట్ టైమ్ కాబట్టే పెద్ద ప్రమాదం తప్పింది. ఇకపై జర జాగ్రత్తగా ఉండాలి.”
“Hypertrophic… హా? అంటే ఏమిటి సార్?”
“అంటే నీ గుండె కండరం సాధారణం కంటే మందంగా పెరిగిందట. అందుకే ఇక నుంచి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.”
“అంతేనా సార్?”
శ్రవణ్ సార్ నా వైపు చూసి కాసేపు ఆగాడు.
“అంతే కాదు… కొన్ని విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, నేను కాలేజీ కి వెళ్ళాలి. బయట మీ ఫ్యామిలీ, రహీమ్ ఉన్నారు. ఉంటా! ” అంటూ వెళ్ళిపోయారు.
సార్ ఏంటి అలా చూసారు? సరేలే… నాకెందుకులే! నన్ను చూడటానికి కాలేజీ మొత్తం వస్తుందని అనుకుంటే, బయట ఎవరు లేరు ఏంటి?
ఇలా నాలో నేనే ఆలోచించుకుంటునప్పుడు ఐసీయు అద్దంలో చూస్తే శ్రవణ్ సార్ మా ఫ్యామిలీతో ఏదో చెబుతున్నారు. వాళ్ళ మాటల మధ్యలో రహీమ్ మరియు నా చెల్లి లోపలికి వచ్చారు.
” మామా రహీమ్! రా, చెల్లి ఫ్రూట్స్ ఏమి తీసుకురాలేదా?”
” లేదు రా! ఇప్పటికే చాలా ఖర్చు అయిందని తీసుకురాలేదు. ” అంటూ నా చెల్లి.
నా చెల్లికి నేనంటే కొంచెం ఎటకారం ఎక్కువ! ఎంతైనా వైజాగ్ లో పెరుగుతుంది కదా!
” పోవే! మామా రహీమ్ రా కూర్చో.”
” మామా! అబ్ కైసా హై? బాగున్నావా? ఫుల్ హుషారుగా కనిపిస్తున్నావ్? “
” ఐయామ్ ఒకే! బయట సార్ ఏంటి మా ఫ్యామిలీతో ఏదో చెబుతున్నారు? “
” గదే మామా! అబ్ strenuous exercise చేయకూడదని చెబుతుండ్రు! ”
” చేస్తే ఏమవుతుందంటా? ”
” చేస్తే! తమరు ఇక ఉండరు అంటా! ఈ భూమికి సెలవు చెప్పి, ఆకాశానికి ఎగిరిపోతారంటా! ” అంటూ వెటకారంగా మా చెల్లి.
” నువ్వు నోర్ముయ్! అసలు నువ్వు నాకు చెల్లిగా ఎలా పుట్టావే? “” నాది కూడా సేమ్ ఫీలింగ్.” అంటూ అటు తిరిగింది.” దాని సంగతి వదిలే! మామా నువ్వు చెప్పు! ”
” మామా, తను బోలిన కదా! వో పాయింట్ కరెక్ట్ హై. అబ్ నువ్వు స్ట్రాన్యూస్ ఎక్సర్సైజ్ లు బంద్ చేయాలి. లేదంటే జరా డేంజర్.”
” మామా strenuous exerciseలు అంటే ఏంటి? నేనెప్పుడు వినలేదే.”
” ముఝే భీ నహీ పతా మామా! బహర్ సార్ బోల్ రహే థే, విన్నా… అబ్ తుమ్ ఫాస్ట్‌గా రన్ చేయకూడదు అట. “
హీ హి అంటూ నా చెల్లి నవ్వుతుంది.
” వీడు వాకింగే చేయడు. అలాంటిది రన్నింగ్. అది కూడా ఫాస్ట్ రన్నింగ్. కామెడీ! ”
” నువ్వు కొంచెం సక్కగా ఉంటావా చెల్లి! రన్నింగ్ అయితే నో ప్రాబ్లం. ఇంతేనా! దీనికే ఇంత సేపు మాట్లాడుతున్నారా? ”
” ఇంకా ఉంది మామా! ”
” జిమ్ చేయకూడదు, ఈత కొట్టకూడదు, ఫుట్బాల్ ఆడకూడదు ముఖ్యంగా నీకు చాలా చిరాకైన పని ఎత్తైన ప్రదేశాలు ఎక్కకూడదు. “
” ఎత్తైనవి అంటే మెట్లు హ? “
” కాదు రా! కొండలు రా కొండ గొర్రు! “
” ఈ సంగతి పక్కన పెట్టు మామా! ఫ్రెషర్స్ మీట్ ఏమైంది? జరిగిందా? లేదా? “
రహీమ్ ఇది చెప్పేలోపు ఐసియు డోర్ తీసుకొని మా మమ్మీడాడీ లోపలకి వచ్చారు.
రాగానే మా మమ్మీ ఒకటే ఏడుపు! మా డాడీ ఆమెను ఓదారుస్తూ! ” ఈరోజు ఈవెనింగ్ డిశ్చార్జ్ అవ్వచ్చు అంటా! అలాగే మీ సార్ నీకు అంతా చెప్పాడంటా కదా! రేపటి నుండి అదే నీ డైలీ రొటీన్. ఇంటిలోనే ఉంటూ మీ మమ్మీ పెట్టింది తిని టాబ్లెట్స్ వేసుకోవాలి! నేను రెండు మూడు రోజులు ఉండకపోవచ్చు. ఆఫీసు పని మీద ముంబై వెళ్లాలి. సరే నా.”
” సరే డాడీ! “అంటూ మనసులో ఇలా అనుకున్న: ఒక్క డైలాగ్ తో న్యూస్ టీవీ యాంకర్స్ అందరినీ గుర్తుచేశాడు. ఎనీవే, డాడీ అయితే ఇంటి దగ్గర ఉండరు! మమ్మీ నేను ఎలా చెబితే అలా వింటుంది. కానీ రేపటి నుండి రోసిని చూడడం కుదరదు! హా ఎన్ని రోజులు రోసిని చూడకుండా ఉండాలి. తన వల్లే నాకిలా జరిగిందని తెలిస్తే, జాలి కలుగుతుంది. అమ్మాయిలకి జాలి కలిగితే ప్రేమించేస్తారు.అంటే తను నన్ను ప్రేమించేస్తుంది.
” రేయ్ కన్నా! నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏడుపు ఆగడం లేదు.. ” అంటూ మా మమ్మీ సౌండ్ చేస్తూ ఏడుస్తుంది.
ఇంతలో నర్స్ లోపలకి వచ్చి ” ప్లీజ్ పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. ఎవరో ఒకరు ఇక్కడ ఉండి మిగిలిన అందరూ బయటికి వెళ్ళండి! ” అనేసరికి రహీమ్ ఒక్కడే ఉన్నాడు.
అబ్బా… రహీమ్ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాడిని అడిగితే ఫ్రెషర్స్ డేలో ఏం జరిగిందో మొత్తం తెలుస్తుంది.
” వావ్ రోసి. నీ హాఫ్ సారీ చానా బాగుంది. నిజంగా చానా అంటే చానా బాగుంది. ” స్టేజ్ పైకి వస్తూ అంటుంది బేగం.
” థ్యాంక్ యూ బేగం. మై బెస్ట్ ఫ్రెండ్. నీ డ్రెస్ కూడా సూపర్. ”
” థ్యాంక్ యూ రోసి. కానీ ఒక్కమాట, అర్జెంట్ గా వన్ జీరో ఎయిట్ కి కాల్ చేయాల్సిందే. నీ గ్లామర్ చూసి ఎవడైనా దిమ్మ తిరిగి పడిపోతాడు. ఆల్రెడీ ఏడైనా పడిపోయిండేమో. బహుషా! ఎమర్జెన్సీ”
“స్టాప్ ఇట్ బేగం. నిజంగా ఈ హాఫ్ సారీ బాగుందా? ”
” అమ్మాయిని.. ముఝే తో తుమ్హే దేఖ్తే హీ ఏసా ఫీల్ హోతా హై… ఫిర్ లడ్కే క్యాసే సంభాలేంగే? అబ్ నీ డ్రీమ్ బాయ్ తుమ్హే దేఖేగా… గిలగిలా కూట్ జాయేగా! ”” హే ఆపు… నాకు సోప్ వెయ్యక? “” సీరియస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్… సిల్వర్ నెక్లెస్… వాచ్ భీ సూపర్… అండ్ ఫైనల్లీ ఈ శాండల్స్! ఓవరాల్‌గా ఏక్‌దమ్ జబర్దస్త్ ఉన్నావే రోసీ “” థ్యాంక్ యూ మై బెస్ట్ ఫ్రెండ్ బేగం. సెలబ్రేషన్ స్టార్ట్ చేసే టైమ్ అయింది. ఒకే యూ వైట్ దేర్. ” అంటూ, బేగం ఇచ్చిన కాంప్లిమెంట్‌తో వచ్చిన కాన్ఫిడెన్సీతో స్టేజ్ మీదకి వెళ్లింది.
“గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్! హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిగ్రీ కాలేజ్‌లో జరుగుతున్న ఈ ఫ్రెషర్స్ మీట్ & గ్రేట్ మిలన్‌కి వచ్చిన మన ప్రిన్సిపల్ రవీందర్ సార్ కి, మన లెక్చరర్స్ అందరికీ, అలాగే సీనియర్స్ అండ్ ఫ్రెషర్స్ అందరికీ హార్ట్‌ఫుల్ వెల్కమ్.
కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన ఫ్రెషర్స్‌కి ఇది ఫస్ట్ మెమొరబుల్ డే కాబోతుంది. సో… ఈరోజుని మన జీవితంలో ఒక మెమొరబుల్ డే గా మార్చుకుందాం. Are you ready everyone? ” అని రోసి అంటే లెక్చరర్స్ తో సహా అందరం ” రెడీ ” అన్నాము. నిబ్బా గాల్లేమో విజిల్స్ వేశారు. మా అరుపులకి తోడుగా డీజే అన్న ఒక సింగిల్ బిజిఎం సౌండ్ వదిలాడు. అది ఇంకా హైలైట్ అయింది.
” Sounds Good, Once again… A very warm welcome to all our freshers!
And this is what we have planned for today…: ( కింద చూపిన ఇమేజ్ లో ఉన్నట్టు చెప్పింది.)”
తను మాట్లాడుతుంటే నేను, రహీమ్ స్టేజ్ ముందు కూర్చొని చూస్తున్నాం. ఆ హాల్ అంతా తన మాటలు వింటోంది. కానీ… నేను మాత్రమే తన పెదాలు కదలికలో సంతోషంగా కనిపిస్తున్న కళ్ళను చూస్తున్న.
“మామా! రోసి యాంకరింగ్ బహుత్ అచ్ఛా! ఫిదా హోగయా! ” అంటూ రహీమ్.
నాకు రహీమ్ మాటలు వినిపించడంలేదు. నిజానికి ఆ హాల్ లో డీజే సౌండ్స్, మిగిలిన మనుషుల గోలలు, ఏమి వినిపించడం లేదు. కేవలం ఫ్యాన్ గాలికి ఎగిరే తన కురులు , ఆ కురులను వెనక్కితోస్తున్న తన చేతివేలు, అప్పుడప్పుడు ఆ చేతివేలుతో హాఫ్ సారీ కప్పేస్తున్న నడుము. ఇంకా చెప్పాలంటే తను హాఫ్ సారీ కాస్త సర్దుకుంటూ నడుస్తున్నప్పుడు ఆ పట్టీలు చప్పుడు కూడా నాకు క్లియర్ గా వినిపిస్తుంది. బహుశా ఇదేనేమో గాంధీ గారు చెప్పిన ఏకాగ్రత.
మత్తెక్కిన కోతిలాగా ఉన్న నా మొఖం చూసి, నా బుగ్గలు పట్టుకొని . ” మామా! మామా! మామా! ” అంటూ రహీమ్ నన్ను అరుస్తున్నాడు. “
రహీమ్, నాకు రోసి తెగ నచ్చేసింది. నాకు ఆ పిల్ల కావాలి. నువ్వు సైడ్ అవ్వాలి. నాకు హెల్ప్ చేయాలి. నేను రాముడిని, తను సీత, నువ్వు హనుమంతుడివి. మమ్మల్ని నువ్వే కలపాలి. ” అంటూ ఆపకుండా మాట్లాడేస్తున్న.
” చుప్ మామా, బ్రెయిన్ డ్యామేజ్ హోగయా? మే ముస్లిమాన్. హనుమంత్ నహీ. ”
” సారీ మామా! సారీ. మీరు ప్రేమకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కదా! నాకు హెల్ప్ చేయు మామా! అలాగే రోసిని నాకు వదిలే మామా! ”
కాస్త ఆలోచించి “మేరే లియే నిన్న క్యాంటీన్ దగ్గర నువ్వు సైడ్ అయ్యేవ్ కదా! అబ్ నీ కోసం నేను ఎర అవుతా. ఠీక్ హై!” అంటూ చిన్న స్మైల్ ఇచ్చాడు.
” ఓహ్! థ్యాంక్ యూ మామా! థ్యాంక్ యూ! మీ భాషలో ఎలా చెప్పాలి? హా.. గుర్తొచ్చింది. ధన్యవాద్. ధన్యవాద్ రహీమ్ భాయ్. ”
” చల్ రే! డాన్స్ దేఖో! ” అని రహీమ్ నాతో అన్నాడు.
వాడు డాన్స్ చూస్తున్నాడు. నేను రోసిని. సడెన్ గా ఒకసారి తను నన్ను చూసింది. నాకేమి చేయాలో తెలియలేదు. వెంటనే మొఖం తిప్పేసుకున్న! హార్ట్ బీట్ పెరిగినట్టు అనిపించింది. అవును, నా హార్ట్ బీట్ పెరుగుతుంది. నాకు శ్వాస ఆడడంలేదు. తనని చూడాలని మనసు చెబుతున్న తల తిప్పలేకపోతున్నా. కళ్ళు తిరిగిపడిపోయా!
రహీమ్ నేను కిందపడడం చూసి. గట్టిగా అరిచాడు. ఆ అరుపు నాకు కనిపిస్తుంది. కానీ అది డాన్స్ సపోర్ట్ చేసే అబ్బాయి అమ్మాయిల గోలలో కలిసిపోయినట్టు ఉంది. రహీమ్ తో పాటు నాకు కుడిపక్క కూర్చొన్న అబ్బాయి సాయం చేసి నన్ను లేపుతున్నారు.
ముందు సీటు లో ఉండే శ్రవణ్ కుమార్ సార్ వెంటనే స్టేజ్ పైకి వెళ్ళి రోసి దగ్గర మైక్ తీసుకొని మ్యూజిక్ స్టాప్ అని అనౌన్స్మెంట్ చేశారు. నా చుట్టూ అందరూ గుమ్మిగూడారు.
ప్రిన్సిపాల్ రవీంద్ర సార్ వచ్చి చూసి “ అందరూ దూరంగా జరగండి… Please, give some space. శ్రవణ్ సార్, మీరు వెంటనే వెళ్లి ambulanceకి call చేయండి. Is there any doctor here? ”
ఎవరో ఒకాయన గబగబ వచ్చి నా గుండె మీద చేతులతో నొక్కుతున్నారు. ఇంకోసారి తన పెదాలతో నాకు ఊపిరి అందించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనినే మెడికల్ లాంగ్వేజ్‌లో CPR అంటారని నాకు తర్వాత తెలిసింది.
అంబులెన్స్‌కి కాల్ చేసినట్టు ఉన్నారు. ఇంతలో శ్రవణ్ సార్ ఇద్దరు సిబ్బందిని తీసుకొచ్చారు.. కానీ నేను ఇంకా స్పృహలోకి రాలేదు. బెడ్ పై ఎత్తి అంబులెన్స్ లోపలకి తీసుకెళ్తున్నారు.
బయట నడుస్తున్న సీన్ వేరు… నా మైండ్ ముందు కనిపిస్తున్న సీన్ వేరు. రోసీ దేవతలా కనిపించి, చేతులు నావైపు చాచి ‘రా’ అంటుంది.‘వస్తున్నా రోసీ…’ అని నేను ఆమె వైపు అడుగు వేస్తుండగానే…

నేను, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిగ్రీ కాలేజ్ లో B.sc data science 2nd year చదువుతున్న.
నేను రహీమ్ ఇద్దరం కాలేజీ క్యాంటీన్ లో ఎదురు ఎదురుగా కూర్చున్నాము. కోక్స్ తాగుతున్నాము. రహీమ్ నాతో ఇలా అన్నాడు.
” మామా, దేకో “
“ఏంటి”
” ఏక్ లడికి వస్తుంది. బహుత్ అచ్చి హై! ”
వెనక్కి తిరిగి చూసా! అంతే ఫ్లాట్ నేను.” గార్జియస్ రా రహీమ్.”
బ్లూ డ్రెస్ లో తను మా పక్క నుండి వెళ్తున్నపుడు పొద్దు తిరుగుడు పువ్వులా మా ఫేస్ లు ఆమె నడక వైపే తిరిగాయి.
” హెల్ప్ కరో మామా! మై ప్యార్ మే పడ్ గయా! లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా! “
” రేయ్, నాకు కూడా నచ్చింది రహీమ్! “
” నీకు పడతారు! మేరే బస్ కి నహి ఐ మామా! ప్లీజ్ హెల్ప్ కరో.”
“ఓకే పదా, ఇప్పుడే పరిచయం చేస్తా! ”
” మామ, నహి. వెయిట్ కరో. జస్ట్ వాచ్ చేద్దాం.”
మా మాటలు విన్న అఖిల్, వెంటనే లేచి ఇలా అన్నాడు.”రహీమ్, లవ్ చేస్తే చెప్పాలి! లేదా లవ్ చేకూడదు. Come on.. May I help you. “
” నహి. డర్ లగ్ రహ ఐ అఖిల్. “
“రేయ్, మనం సెకండ్ ఇయర్ ఇప్పుడు. సీనియర్స్. No one can’t stop us. Okay! Let’s go man. Express your beautiful first sight love.”
” అఖిల్, రహీమ్ వద్దునప్పుడు వద్దులే! “
” You fear students. మీ వల్ల కాకపోతే చెప్పండి. నేను ట్రై చేసి పడగొడతా. ”
” కామెడీ చేయకు అఖిల్. ఆ పిల్లని రహీమ్ లవ్ చేస్తున్నాడు. నువ్వు సైడ్ అవ్వడం నీకు మంచిది. “
” నేను సైడ్ అవ్వాలా? నాన్సెన్స్.. ఈ సీన్ ని express చేయడానికి తెలుగులో ఒక లైన్ ఉంటుంది. హా .. i remember that. మింగలేక మంగళారం అన్నాడు అంట ఎవడో! అంతేకదా? Am I correct? ”
” చుప్ అఖిల్. బ్యాంకెలౌడే, మాదర్చోత్. ”
” రేయ్ అఖిల్. దొబ్బే ఇక్కడ నుండి. నువ్వు ఇంకొక మాట అంటే, నీ భాషలో ఒక మాట చెబుతా. Dogs bite.. slipper slap. “
మా వార్నింగ్ కి బయపడ్డాడో లేదో తెలియదుగానీ అక్కడ నుండి వెళ్ళిపోయి మాకు పెద్ద షాక్ ఇచ్చాడు వాడు.
వాడు నేరుగా ఆ అమ్మాయి పక్కకి వెళ్ళి కూర్చొని, తన భుజంపై చేయి వేసి.. మా వైపు కోపంగా చూస్తూ తన బుగ్గపై ముద్దు పెట్టాడు. ఇక అంతే మాకు షాక్.
” రేయ్ రహీమ్. ఏంటిరా వాడు ఆ అమ్మాయికి ముద్దు పెట్టాడు. ” మా ఇద్దరిని వైపు ‘ మీ బతుకులు అంతే ‘ అన్నట్టు చూసాడు.
” వీడిని ఎలాగైనా కూట్నా పడ్తది మామా! నేను కర్చీఫ్ వేసి సీట్ రిజర్వ్ చేసుకున్నా… వాడు ఆ సీట్‌లో వచ్చి కూర్చున్నాడు! “
” మామా, మనం పొరబడుతున్నాము. అసలు ఆ సీటే వాడిది. నువ్వే తెలియక కర్చీఫ్ వేశావు. వదిలే.. అడివిలో ఆకులు కరువ, కాలేజీ లో అమ్మాయిలు కరువ? చెప్పు!”
” చోడ్దొ నహి మామా! నాకు దక్కనిది వాడికి దక్కకూడదు రా మామా… యేన్ హువా అయినా! “
“సరే మామ” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాము.
—
ఆగస్టు నాలుగున, మా కాలేజీలో FRESHERS MEET & GREAT – MILAN ఏర్పాటు చేశారు. అప్పటివరకు సీనియర్స్ యూనిఫాంలో, ఫ్రెషర్స్ సివిల్ డ్రెస్ లో కందిరీగలు, కాక్రోచ్ లా ఉండే అమ్మాయిలు కాస్త ఆరోజు మాత్రం రంగురంగు సీతాకోకచిలకలా తయారై వచ్చారు.
మా అబ్బాయిలు కూడా దోమలాగ అప్పుడప్పుడు కాలేజీకి వచ్చేవారు కాస్త ఆరోజు ఈగలగా వాలిపోయారు. అయినా కానీ ఆ సీతాకోకలు ముందు మేము తేలిపోయాము.
“ ఏం కలర్ రా మామా… క్యా బ్యూటీ హై! మిస్ యూనివర్స్ పోటీలు చూస్తున్నట్టుంది! ”
” అవును రహీమ్! కానీ ఇక్కడే గేట్ దగ్గరే ఇలా చూస్తుంటే హచ్చు కుక్కల్లా తీసిపారేస్తారు మనలని. “
” అయితే అబ్ క్యా కర్తె? చెప్పు! “
” మనం స్టేజ్ ముందుండే చైర్స్ లో రాయల్ గా కూర్చుని చూస్తుంటే.. మన ముందు అమ్మాయిలు వెళ్తుంటే, అప్పుడు అది మిస్ యూనివర్స్ పోటీలా జరుగుతున్నట్టు ఉంటుంది. మనం కూడా ఎవరికో ఒకరికి ఎక్కువ మార్క్స్ వేసి సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు! ఏమంటావు? ”
” మామా… వో మార్క్స్ ఏదో ఇక్కడే వేద్దాం! ”
ఇంతలో యమహా ఎఫ్.జెడ్ బ్లూ కలర్ బైక్ పై అఖిల్ గాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా ముందు బ్రేక్ వేశాడు.
అంతవరకు అఖిల్ గాడు నాకు,రహీమ్ కు క్లాస్మేట్ మాత్రమే! కానీ ఆ తర్వాతే వాడు మాకు శత్రువు అయ్యాడు. ఇది పక్కన పెడితే హాఫ్ శారీలో ఆ అమ్మాయి బైక్ మీద నుండి దిగుతుంటే యువరాణిలా అనిపించింది మాకు.
అది చూసి తట్టుకోలేని రహీమ్ అక్కడి నుండి పోదామని నా చేయి పట్టుకొని స్టేజ్ ముందుకు తీసుకెళ్లాడు. ఆ స్టేజ్ ముందు నుంచున్న నాకు, మైక్ లో ఒక గొంతు వినిపించింది.
” హలో చెక్, హలో చెక్. గుడ్, ఆల్ డన్ బ్రదర్ ” అంటూ ఒక అమ్మాయి డీజే సౌండ్ బ్రదర్ కు చెబుతుంటే ఆమెను చూసి నా గుండె జారి గల్లంతయింది.
ఇక వేరే అమ్మాయిలను చూడకుండానే ఆ అమ్మాయికి 100 మార్కులు వేశా, ఈ పిల్లనే పడగొట్టాలని ఫిక్స్ అయ్యా!
” గ్రీన్ శారీ 60, టాల్ కుసుమ 78, చబ్బీ చంద్రిక 93, ఫాతిమా 94, శాహనా 96, ఫరీదా 97, బ్యూటీ బేగం 98, ఫైనల్ యాంకర్ రోసి సౌ మే సౌ మామా! ”
రహీమ్ ఏదో లెక్కలు వేసుకుంటున్నాడని అర్థమవుతుంది కానీ నా మనసు, కళ్ళు అంతా ఆమె వైపే. మా కాలేజీలో పొద్దుతిరుగుడు పువ్వుకి పోటీగా రోజా పువ్వు వచ్చిందని నాకు అనిపించింది.
కానీ మా రహీమ్ గాడు 100 మార్కులు ఎవరికి ఇచ్చాడో తెలుసుకోవడానికి వాడివైపు చూసా!” మామా, ఫిక్స్ కరో. యాంకర్ రోసి సౌ మే సౌ మార్క్స్. ముఝే లగ్తా హై, నేను ఆ లడీకితో ప్యార్ లో పడిపోతున్నా! ”
” ఎవరు మామా! నీ చేత 100 మార్కులు పొంది , నీ మనసు దోచుకున్న పిల్ల? ”
” యాంకర్ రోసి, 2nd year B.sc AI & Ml గ్రూప్. ” అంటూ స్టేజీపై ఉండే మైక్ పట్టుకొని మాట్లాడుతున్న పిల్ల వైపు చూపించాడు.
” యాంకర్ నా? అరే మామా, అది నా పిల్ల రా! “
పార్ట్ 1 ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
నీవు నమ్మకంగా ఉంటావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
నీవు గౌరవంగా నడుచుకుంటావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
నీవు డబ్బుకంటే మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
నీవు తల్లిదండ్రులు మాట వింటావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
నీవు బాడీ వర్కౌట్ చేయవా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
నీవు అధికారం చూపలేవా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
నీవు స్వార్థం లేకుండా జీవిస్తున్నావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
నీవు మోసం చేయడానికి భయపడతావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
నీవు సింపుల్ లైఫ్ కోరుకుంటావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
ప్రతి చిన్న విషయానికి నిన్ను నీవు నిందించుకుంటావా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
నీవు ఒంటరిగా బతికే ధైర్యం లేదా? అయితే నువ్వు లవ్ చేయడానికి పనికిరావు.
ఈ లక్షణాలు అన్ని నీలో ఉంటే బయట సమాజంలో నువ్వొక గుడ్ పర్సన్. కానీ వాళ్ళ అంతర్గత భావాలలో మాత్రం నువ్వొక చేతకాని దద్దమవి.
రివెంజ్ లవ్: ఇందులో నువ్వు మోసం చేయాలి, స్వార్థంతో బ్రతకాలి, మర్యాద లేకుండా ఎప్పుడూ కోపంగా ఉండాలి,ఏమి చేసైనా ప్రేమించిన మనిషిని ఇబ్బంది పెట్టీ సంతోషంగా బ్రతకాలి.
ప్రేమకి ఒక్కప్పుడు అర్థం ప్రేమ ఇవ్వడం. కానీ ఇప్పుడు ప్రేమ కోరడం.
నేను నీకోసం ఏదైనా చేస్తాను అన్న దగ్గరనుండి నాకోసం నువ్వు ఏది ఎందుకు చెయ్యవు? అనేవారుకు వచ్చేసింది.
కిరణ్ మారెక్ పంపిన లింక్ ఓపెన్ చేశాడు.
ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై వీడియో ప్లే అవ్వడం మొదలైంది. అది స్పా సెంటర్‌లోని ఒక గది.
మూలన అమర్చిన సీసీ కెమెరా ఫుటేజ్‌లా కనిపిస్తోంది.
ఆ వీడియోలో అనూష ఉంది.
ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు.
కొన్ని క్షణాలు స్క్రీన్ వైపే చూస్తూ ఉండిపోయాడు కిరణ్.
ఆ తర్వాత ఒక్కసారిగా ల్యాప్‌టాప్ మూసేశాడు.
కుర్చీలో వెనక్కి ఆనుకుని కళ్లుమూసుకున్నాడు.
మారెక్ చెప్పిందే నిజమా… లేక ఇందులో కూడా ఏదైనా మోసం ఉందా…
ఏదీ అర్థం కాక అతని మనసు తటపటాయించింది.
అప్పుడే టేబుల్ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అయింది.
అనూష కాల్ చేస్తోంది.
కిరణ్ స్క్రీన్ వైపు మాత్రమే చూశాడు.కాల్ కట్ అయిపోయింది.
కొద్దిసేపటికే మళ్లీ ఫోన్ మోగింది.
ఈసారి సరోజ.
లోతుగా ఊపిరి తీసుకుని కాల్ లిఫ్ట్ చేశాడు.
“చెప్పమ్మా.”
“కిరణ్… ఒకసారి హైదరాబాద్ రా నాన్న. నీతో మాట్లాడాల్సిన విషయం ఉంది.” అంది సరోజ.
“ఏమైంది అమ్మ?”
“ఫోన్‌లో చెప్పే విషయం కాదు. నువ్వు వచ్చాక మాట్లాడుకుందాం.”
కిరణ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు.”సరే అమ్మ. రేపు ఫ్లైట్ చూసుకుని వస్తాను.”
“సరే నాన్న…”అని చెప్పగానే కిరణ్ కాల్ ముగించాడు.
మొదటిసారి అనూష ప్రస్తావన లేకుండా కిరణ్ ఫోన్ పెట్టేయడం. ఇది గమనిస్తూ ఆలోచించుకుంటూ ఉండిపోయింది సరోజ.
అనూష గదిలో…
ఫోన్ మరోసారి మోగింది.అదే నంబర్.
కట్ చేసింది.
మళ్లీ మోగింది.
మళ్లీ కట్ చేసింది.
మూడోసారి కూడా అదే నంబర్ రావడంతో చిరాకుగా కాల్ లిఫ్ట్ చేసింది.”ఏంటి నీ గోల? ఎన్నిసార్లు చేస్తావ్?”
“Listen, Anusha…” అన్నాడు మారెక్.
“నీ మాటలు వినే అవసరం నాకు లేదు.”
“ఒక్కసారి విను. నేను నీ భర్తకు అన్నీ పంపించాను. ఫోటోలు… వీడియో… ఏదీ దాచలేదు.”
అనూష గుండె ఒక్కసారిగా బరువెక్కింది.
మారెక్ మళ్లీ మాట్లాడాడు.”ఇప్పటికే అతను చూసి ఉంటాడు. ఇక నుంచి ఏం జరుగుతుందో… అది నీ చేతుల్లో లేదు. నా ఆఫర్ ఒప్పుకుంటే నీ జీవితం మరోలా ఉండేది. బ్యాడ్లక్.”అంతే.
కాల్ కట్ అయిపోయింది.
కొన్ని క్షణాలు అనూష అలాగే నిలబడి ఉంది.
తర్వాత ఒక్కసారిగా ఫోన్‌ను గోడకేసి బలంగా విసిరేసింది.”You bastard! I hope you die! Get lost… Motherfucker!”ఫోన్ నేలపై పడి స్క్రీన్ బద్దలైంది.
ఆ శబ్దం విని సరోజ పరుగెత్తుకుంటూ గది దగ్గరకు వచ్చింది. తలుపు తోసి లోపలికి అడుగుపెట్టింది.
అనూష మంచం మీద కూర్చుని ముఖం చేతుల్లో దాచుకుని ఏడుస్తోంది. సరోజ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసింది.కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు.
తర్వాత…”రా… బయటికి వెళ్దాం.” అంది.
అనూష మెల్లగా తలెత్తి చూసింది.
“నీతో ఒక విషయం చెప్పాలి.”సరోజ గొంతు భారంగా మారింది.”ఇన్నేళ్లుగా నా మనసులో దాచుకున్న విషయం అది. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు.”
ఒక్క క్షణం ఆగి అనూష కళ్లలోకి చూసింది.
“ముందు నేను చెప్పేది పూర్తిగా విను. ఆ తర్వాత నీకు ఏం అడగాలనిపించినా అడుగు.”
లండన్, ఉదయం 9 గంటలు.
టేబుల్ పై ఉన్న ఫోన్ మోగుతుంది. స్క్రీన్ పై ఈసారి చూపిస్తుంది మారెక్ +48 కోడ్ కాదు, రీటా.
ఫోన్ మోగుతున్న శబ్దం నెమ్మదిగా కిరణ్ నిద్రను పాడుచేస్తుంది. రెండు రింగులు తర్వాత మూడో రింగకు కిరణ్ స్క్రీన్ పై పేరు చూడకుండానే లిఫ్ట్ చేశాడు. ” హలో “
“Good morning babe! Where are you? Iam waiting at yOyo hotel.” అంటూ రీటా.
కాస్త ఉలిక్కి పడి లేచి స్క్రీన్ పై కనిపించిన రీటా పేరు చూసాడు. డేట్ కి వెళ్లాల్సిన విషయం గుర్తుకొచ్చింది. ” యా, గుడ్ మార్నింగ్ బేబ్, ఐయామ్ స్టార్టెడ్. జస్ట్ 20 మినిట్స్, ఐ విల్ బి దేర్. వి క్యాచ్ అప్, మీట్ అప్, అప్ అప్.. థమ్సప్ .
రీటా చిన్నగా నవ్వి”you funny man, iam waiting babe.. come fast.”
” ఓన్లీ 20 మినిట్స్, టుడే ఐ రాక్డ్ ద రూమ్ విత్ థౌసండ్ వాలా కిస్ బాంబ్.”
” Hey kiran, don’t expect me hipe over! I know, Some of my friends told me that indian guys fight only short period with mass action. But I want ten thousand kiss wala with long peried action. Bring 3 tablets via-agra “
” రీటా, మై డార్లింగ్. థాట్స్ వై ఐ లైక్ యు సోమచ్. బట్ డోంట్ వాంట్ వయా-హాగ్రా పిల్స్. ఐ వాంట్ ఓన్లీ వాటర్మేలోన్ జ్యూస్. సో యూ టేక్ టూ మీ వన్ వాటర్మేలోన్ జ్యూస్. సారీ 3 వాటర్మేలోన్ జ్యూసెస్. టుడే యూ సీ మై హార్స్ పవర్.”
” I can’t control. Please come fast babe. “
” బేబ్, గెస్ వాట్ ఐ డూ నౌ? “
” I can’t, tell me.”
” రీటా డార్లింగ్, ఐ డ్రింక్ రెడ్బుల్. ఇట్ గివ్స్ వింగ్స్ మీ. ఐ కేం నియర్ టూ యూ విత్ వింగ్స్. వి ఫ్లై ఇన్ టూ ద స్కై.”
” You shut up kiran, I don’t want words. I want wonders with your Thunder beats on my back. I am still waiting at yOyo hotel.”
రీటా, కిరణ్ మాటల మధ్యలో అనూష కిరణ్ కు కాల్ చేస్తుంది. బిజి టోన్ వినిపించేసరికి అనూష కాల్ కట్ కిరణ్ కాల్ కోసం వెయిట్ చేస్తుంది. రీటా కాల్ ఎండ్ చేసి, డేట్ కి వెళ్ళడానికి ఫ్రెష్ అవుతున్నాడు.
అనూష ఇంట్లో, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కూర్చుంది సోఫాలో, రింగ్ అవుతూనే ఉంది, కిరణ్ తీయటలేదు.
“తీయట్లేదా?” సరోజ అడిగింది.
“లేదు అత్తయ్యా.” అనూష కట్ చేసింది, మళ్ళీ ట్రై చేసింది.
మూడోసారి కూడా తీయలేదు కిరణ్. ఫోన్ కిందపెట్టేసింది, గుండెల్లో ఏదో బరువు కొత్తగా చేరుతూ.
కిరణ్, రీటా లు ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే కిరణ్ మొబైల్ స్క్రీన్ పై మారెక్ +48 కోడ్ నంబర్ మోగుతూ కనిపిస్తుంది. ఆ రింగ్ చప్పుడు కిరణ్ ను డిస్ట్రక్షన్ చేసిన తన వైపు రిటర్న్ తిప్పుకుంది రీటా.
ఆ గదిలో మోగే పాప్ మ్యూజిక్ సౌండ్ కంటే రీటా అరుపులే గట్టిగా వినిపిస్తున్నాయి.
ది హార్స్ ఇస్ టైర్డ్ అండ్ స్లీప్…
అనుషాను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని మొండి పట్టుతో ఏమి చేయడానికైనా సిద్ధమయ్యాడు మారెక్. కిరణ్, సరోజ మరియు అనుషాలు ఫోన్ లకు మార్పింగ్ చేసిన వీడియోలు , ఫోటోలుతో పాటు ఒక లింక్ కూడా పంపాడు.
2 గంటలు నిద్ర తర్వాత లేచిన కిరణ్, తన ఫోన్ ఒక చెక్ చేశాడు. అనూష , సరోజ మరియు మారెక్ లు నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి.
మారెక్ సంగతి తెల్లుదాం అని కాల్ చేశాడు.
అవతల మారెక్ ఫోన్ ఎత్తి ” హలో కిరణ్. “
“వాట్స్ యువర్ ప్రాబ్లం? వై ఆర్ యూ కాలింగ్? ఐ కాంట్ లిస్జెన్ యువర్ వర్డ్స్.” అంటూ స్పీడ్ గా చిరకతో కూడిన గొంతుతో కాల్ కట్ చేయబోయాడు.
” హే కిరణ్. వన్ సెకండ్. లిస్జెన్, ఐ సెండ్ సం వీడియోస్ టూ యువర్ ఫోన్. వాచ్, థన్ టేక్ డెసిషన్.” అంటూ కాల్ కట్ చేసాడు.
మారెక్ మాటలు సీరియస్ గా తీసుకోలేదు కానీ.. ఆ ఫైల్స్ ఓపెన్ చేసి చూసాడు. ఇందులో ఏముంది అని చూసాడు. వీడియో చూసి షాక్ అయ్యాడు. ఫోటోలు అన్ని చూశాడు. ఇంకా ఆ లింక్ పై క్లిక్ చేసి చూసాడు. వెంటనే తన ఫోన్ లో ఏమి జరుగుతుందో కిరణ్ కు అర్థమవ్వలేదు.
చింతపల్లి ఇన్‌ఛార్జ్ ఎస్సై నరేందర్ కేజీహెచ్ ఆర్థోపెడిక్ వార్డులోకి వచ్చాడు. అక్కడ డాక్టర్ రాజు బెడ్ మీద ఉన్న బన్నీ వాస్ బిపి, పల్స్ చెక్ చేస్తున్నాడు.
ఎస్సై నరేందర్ బన్నీ వాస్ వైపు సీరియస్‌గా చూస్తూ, డాక్టర్ రాజు గారి అనుమతితో ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
“బన్నీ వాస్… లావణ్య భర్త రవికుమార్‌ని మీరే చంపినట్టు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. నిజం ఒప్పుకోండి! నువ్వు ఇప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నావ్… నువ్వు చెప్పే నిజాలే చట్టం ముందు న్యాయం గెలిచేలా చేస్తాయి!” అని అడిగాడు.
బన్నీ వాస్ బెడ్ మీద కదలకుండా, “నాకేమీ తెలియదు సార్… ఆ రోజు మేము అక్కడికి వెళ్లేసరికే రవికుమార్ చనిపోయి ఉన్నాడు.”
“అబద్ధం చెబుతున్నావు! రవిని చంపింది మీ హోటల్ వాళ్ళే అని లావణ్య ఫిర్యాదు ఇచ్చింది. నిజం దాచడానికి చూస్తే నిన్నే మెయిన్ అక్యూజ్డ్‌ని చేస్తాను!” అంటూ నరేందర్ గట్టిగా కేకలు వేశాడు.
అక్కడే ఉన్న డాక్టర్ రాజు వెంటనే కల్పించుకుని, “సార్, ఆయన హెల్త్ కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది. కాస్త నెమ్మదిగా విచారించండి… లేకపోతే పల్స్ పడిపోయి, ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది ” అని హెచ్చరించాడు.
నరేందర్ కొద్దిసేపు ఆగి, “ఓహ్, సరే డాక్టర్. డాక్టర్… వీడు ఇలా అడిగితే నిజం చెప్పేలా లేడు. నా స్టైల్‌లో లోపల విచారిస్తాను… మీరు, మిగతా పోలీసులు కాస్త బయట కాపలా ఉండండి” అని చెప్పి డ్యూటీ పోలీసులను బయటికి పంపించేశాడు.
కానీ డాక్టర్ రాజు ఆ మాటను నిరాకరించి ఇలా అన్నాడు; సారీ సార్, మా హాస్పిటల్ లో ఎలాంటి థర్డ్ డిగ్రీ ఇన్వెస్టిగేషన్ కు అనుమతి లేదు.
“డాక్టర్ గారు, నేను థర్డ్ డిగ్రీ లాంటి ఇన్వెస్టిగేషన్ తీసుకోను, కేసుకు సంబంధించి స్టేట్ మాత్రమే తీసుకుంటాను. మీరు కాస్త మెడికల్ రిపోర్ట్స్ తీసి బయట ఉన్న మా కానిస్టేబుల్‌కి చెక్ చేయడానికి ఇవ్వండి. నేను సీక్రెట్ ఆఫీషియల్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలి” అంటూ డాక్టర్ రాజును అనుమతి కోరుతాడు.
ఆయన ఒప్పుకొని బయటికి వెళ్తారు. వాళ్లు బయటికి వెళ్లగానే వార్డు తలుపులు మూసి, బన్నీ వాస్ దగ్గరకు జరిగాడు నరేందర్. తన జేబులోంచి ఫోన్ తీసి నేరుగా ఎస్పీకి కాల్ చేసి, స్పీకర్ ఆన్ చేసి బన్నీ వాస్‌కి ఫోన్ అందించాడు.
అవతలి నుంచి ఎస్పీ గొంతు వినిపించింది.”బన్నీ… నరేందర్ మన మనిషే. ఎలాంటి భయం లేకుండా మాట్లాడు.”
ఎస్పీ గొంతు వినగానే బన్నీ వాస్ ముఖంలో కంగారు తగ్గి ప్రశాంతంగా ఫోన్ ఇచ్చేశాడు.
నరేందర్ ఫోన్ జేబులో పెట్టుకుని, “ఇక్కడ నాటకాలు ఆడటానికి ఎక్కువ సమయం లేదు బన్నీ. ఈ కేస్ నుంచి భూపతి రెడ్డి గారి పేరు తీసేసి… జరిగిన కథలో లావణ్యే నేరస్థురాలు అనిపించేలా ఉన్న ఒక్క పాయింట్ చెప్పు” అని సూటిగా అడిగాడు ఎస్సై.
బన్నీ వాస్ ఆలోచించి చెప్పడం మొదలుపెట్టాడు:”నరేందర్ గారు… లావణ్యకి వేరే ఒకరితో సీక్రెట్ అఫైర్ ఉంది. ఆ విషయం భర్త రవికుమార్‌కి తెలిసిపోతుందనే భయంతో, అతన్ని అడ్డు తొలగించుకోవడానికి ప్లాన్ చేసింది. ఆ రోజు మా హోటల్ నుంచి రూమ్‌కి ఆర్డర్ చేసిన గ్రీన్ టీలో లావణ్యే స్వయంగా విషం కలిపి రవికుమార్‌కి ఇచ్చి చంపేసింది. కేసులోంచి తప్పించుకోవడానికి ఇప్పుడు నాటకాలు ఆడుతోంది అని రికార్డ్ చేయండి.”
ఎస్సై నరేందర్ ఎలాంటి ప్రశ్నలు అడగకుండా, బన్నీ వాస్ చెప్పిన ఆ పాయింట్‌ని కాగితం మీద రాసుకుని సంతకం చేయించుకున్నాడు.
ఆ వెంటనే వార్డు బయటికి వచ్చి, ఎస్పీకి ఫోన్ చేసి బన్నీ వాస్ ఇచ్చిన స్టేట్‌మెంట్ గురించి వివరించాడు నరేందర్. లావణ్యను విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవడానికి వెంటనే ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లను కేజీహెచ్ ఆసుపత్రికి పంపాల్సిందిగా స్టేషన్‌కి సమాచారం అందించాడు.
కొద్దిసేపటికి స్టేషన్ నుంచి ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు కేజీహెచ్‌కి చేరుకున్నారు.
ఎస్సై నరేందర్ ఐసియు బయట కూర్చుని ఉన్న లావణ్య దగ్గరకు వెళ్లి, “లావణ్య గారు… మీ భర్త రవికుమార్ హత్య కేసులో మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ కోసం స్టేషన్‌కి తీసుకెళ్లాలి. రండి,” అన్నాడు.
లావణ్య ఆందోళనగా లేచి నిలబడింది. “ఏంటి? ఇన్వెస్టిగేషనా? అసలు ఏం మాట్లాడుతున్నారు ఎస్సై గారు?”
“సాక్షి బన్నీ వాస్ మీ మీద పక్కా ఆధారాలతో స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మీరే గ్రీన్ టీలో విషం కలిపి మీ భర్తను చంపారని చెప్పాడు. పదండి,” అని గంభీరంగా అన్నాడు నరేందర్.
లావణ్య కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. “సార్… సీఐ చంద్రమౌళి గారు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నా తరఫు నుంచి స్టేట్‌మెంట్ ఇచ్చాను. పైగా నా స్నేహితురాలు రమ్య లోపల ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయినా నా భర్తను నేను చంపలేదు సార్… నన్ను నమ్మండి!” అంటూ ఏడుస్తూ ఎస్సై నరేందర్‌ని ప్రాధేయపడింది.
కానీ నరేందర్ ఏమీ వినకుండా, లేడీ కానిస్టేబుళ్లకు సైగ చేసి లావణ్యను అక్కడి నుంచి స్టేషన్‌కి తీసుకెళ్లేలా చూశాడు.
మరోవైపు, కానిస్టేబుళ్లు రాము, వెంకట్ కంట్రోల్ రూమ్ ద్వారా శ్రీను ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయించారు.
లాస్ట్ లోకేషన్ విశాఖపట్నం శివార్లలోని పాత పారిశ్రామిక ప్రాంతం చూపించడంతో రాము, వెంకట్ వెంటనే జీపులో అక్కడ ఉన్న ఖాళీ గోడౌన్ దగ్గరకు వెళ్లారు.
లోపల మూల మూలలా వెతికారు.కానీ అక్కడ శ్రీను లేడు. అతని బైక్ గానీ, ఫోన్ గానీ, ఎలాంటి ఆధారాలు గానీ అక్కడ దొరకలేదు.
“రేయ్ వెంకట్… లాస్ట్ లోకేషన్ ఇక్కడే చూపించింది. కానీ వాడు ఇటు వచ్చినట్టు కూడా ఏ ఆధారమూ లేదు. అసలు శ్రీనుకి ఏమైందిరా?” అని రాము ఆందోళనగా వెంకట్‌తో అన్నాడు.
అనూష సోఫాలో తలదించుకుని కూర్చుంది. సరోజ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది. కాసేపటి క్రితం తెలిసిన నిజం ఇంకా ఆమె మనసును వదలడం లేదు.
అంతలో గ్లాస్ టేబుల్‌పై ఉన్న ఫోన్ మోగింది.స్క్రీన్‌పై…”కిరణ్ My Son”అని కనిపించింది.
అది చూడగానే అనూష కళ్లలో మళ్లీ నీళ్లు తిరిగాయి. సరోజ ఫోన్ దగ్గరకు వచ్చేలోపే కాల్ కట్ అయింది. వెంటనే రెండోసారి ఫోన్ మోగింది.
సరోజ కాల్ లిఫ్ట్ చేసింది.”హలో నాన్న… చెప్పు.”
“అమ్మ… ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ఏం చేస్తున్నావ్?” అన్నాడు కిరణ్.
“అయ్యో నాన్న… చిన్న పనిలో ఉన్నా. అందుకే ఎత్తలేకపోయా.” అంటూ సరోజ స్పీకర్ ఆన్ చేసింది.
“సరే… ఇంతకీ అనూష ఎక్కడుంది? ఫోన్ చేస్తే తీయడం లేదు.”
“రేష్మ అని ఓ అమ్మాయి వచ్చింది నాన్న. తన ఫ్రెండ్ అంట. ఇద్దరూ బయటికి వెళ్లారు. ఫోన్ మాత్రం ఇక్కడే హాల్‌లో పెట్టి వెళ్లింది. ఏమైంది… ఏమైనా చెప్పాలా తనకి?”
“రేష్మా? హ్మ్… వెళ్లి ఎంతసేపైంది?” అని కిరణ్త అన్నాడు.
అనూష తన వేళ్లతో ‘అరగంట’ అని సైగ చేసింది.
“ఓ అరగంట అయిందిలే నాన్న. ఏదైనా అర్జెంట్ విషయమా?”
కొన్ని క్షణాలు కిరణ్ ఏమీ మాట్లాడలేదు.ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు.”అమ్మ… నీకొక విషయం చెబుతా. మారెక్ అని ఒకడు నాకు కాల్ చేశాడు. క్రాకోలో స్పా సెంటర్ నడుపుతున్నానన్నాడు. అనూష అక్కడ పనిచేసిందని కూడా చెప్పాడు.”
సరోజ గుండె ఒక్కసారి బరువెక్కింది. అయినా బయటకు మాత్రం ఏమీ తెలియనట్టే…”అదేనా నాన్న… ఇంకేం చెప్పిండు?” అని అడిగింది.
“చెప్పాలనుకున్నాడు. కానీ అప్పుడే మా బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అయింది. నేను కాల్ కట్ చేశా. తర్వాత చేశాను… స్విచ్ ఆఫ్ వచ్చింది.”ఒక్క క్షణం ఆగి మళ్లీ అన్నాడు.”అమ్మ… ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో.” “ఎవడో ఫోన్ చేసి ఏదో చెప్పాడని నా భార్యను నేను అనుమానించను. అనూష మీద నాకు నమ్మకం ఉంది. తను ఏ పని చేసినా, ఏ పరిస్థితిలో చేసినా… దాని వెనక ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతున్నా.”
ఆ మాటలు విన్న అనూష తల మరింత వాలిపోయింది.
సరోజ ఆమె వైపు చూసింది.”నాన్న… రాముడు అంతటివాడే లోకం మాటలు విని సీతమ్మను పరీక్షించాడు. కానీ నువ్వు నీ భార్యను నమ్ముతున్నావంటే… నీ మనసు ఎంత పెద్దదో అర్థమవుతోంది.” అంది.
కానీ మనసులో ఇలా అనుకుంది. “నాన్న… నిన్ను మంచోడిగా పెంచినందుకు ఇప్పుడే భయమేస్తుంది. ఎదుటివాళ్లను ఇంత గుడ్డిగా నమ్మే మనసు కూడా మంచిది కాదురా.”
అప్పుడే…”Kiran… Come to the board meeting room.”అంటూ రీటా అక్కడికి వచ్చింది.
“అమ్మ… నేను తర్వాత చేస్తా.”
“సరే నాన్న… కానీ మారెక్ మళ్లీ ఫోన్ చేస్తే, ఈసారి పూర్తిగా విను.”
“అలాగే అమ్మ. బై.”కాల్ కట్ అయింది.
సరోజ నెమ్మదిగా ఫోన్‌ను టేబుల్ మీద పెట్టింది. అనూష లేచి రెండు అడుగులు వేసింది. సరోజ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా ఆమె కాళ్లపై పడిపోయింది.”అత్తయ్యా… నన్ను క్షమించండి…” అంటూ బోరున ఏడ్చింది.
సరోజ మూడు క్షణాలు అలాగే నిలబడి ఉంది. ఆ తర్వాత వంగి అనూష భుజాలు పట్టుకుని లేపింది.ఆమె కళ్లపై కారుతున్న కన్నీళ్లను చీర కొంగుతో తుడిచింది. పక్కనే సోఫాలో కూర్చోబెట్టి, ఆమె తలపై చేయి వేసింది.”ఇప్పుడేం మాట్లాడకు అనూష… ముందు ఏడుపు ఆపు.” అంది మెల్లగా.
అంతే…ఆ మాటతో అనూష ఇంకా గట్టిగా ఏడ్చేసింది.
లండన్ – అర్ధరాత్రి 10:00 గంటలు
బోర్డ్ మీటింగ్ విజయవంతంగా పూర్తవడంతో కంపెనీ ఏర్పాటు చేసిన పార్టీలో కొద్దిసేపు గడిపిన కిరణ్, అలసటతో ఇంటికి చేరుకున్నాడు.బట్టలు కూడా మార్చుకోకుండా మంచంపై వాలిపోయాడు.
కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నాడు.అప్పుడే బెడ్‌సైడ్ టేబుల్‌పై ఉన్న అతని మొబైల్ ఫోన్ వెలిగింది.
Incoming Call+48…స్క్రీన్‌పై పోలాండ్ దేశ కోడ్ కనిపిస్తోంది.
మారెక్ నుంచి కాల్ వస్తోంది.గదిలో ఫోన్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది.కానీ గాఢ నిద్రలో ఉన్న కిరణ్‌కు అది వినిపించలేదు.
రియాలిటీ, రొమాన్స్, కామెడీ, సస్పెన్స్ మరియు ఫిలాసఫీ కలబోసిన కథల సమాహారం.మన సంస్కృతిని, జీవిత సత్యాలను రేపటి తరానికి పరిచయం చేసే డిజిటల్ వేదిక